KCR | నూటినూరు శాతం మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండే, దుఖం వచ్చేది ఎమ్మెల్యేలుగా ఉన్ను ఏం చేయలేని పరిస్థితి.. ఆగమాగం. ఎట్లుండె తెలంగాణ. తెలంగాణ రాకముందు ఎంత భయంకరమైన బాధలుండే.. ఎంత కష్టముండే.
అసెంబ్లీలో వరంగల్ ఎమ్మెల్యే ఉండే ఏదో విషయంలో ఆయన మాట్లాడపోతే .. ఏ అసెంబ్లీలో తెలంగాణ అని మాట్లాడొద్దు.. అనొద్దు.. నిషేధం. అంత భయంకరమైన వివక్ష. మన భాష, మన బతుకు మీద, మన నీళ్ల మీద దాడి, మన ఉద్యోగాల మీద మన వనరుల మీద, మన ఆస్తుల మీదమొత్తం దోపిడీ చేయడం తప్ప ఇక్కడి ప్రజలను బికారీల్లాగా వదిలిపెట్టారని కేసీఆర్ అన్నారు.
గంజి కేంద్రాలు పెట్టేవాళ్లు..
రైతాంగం ఆగమాగమైపోయి చెట్టుకొకలు పుట్టుకొకరు అయిపోయారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సారెస్పీ కాలువ ఉన్నట్వంటి జగిత్యాల, మెట్పల్లి, చొప్పదండి ప్రాంతాల నుంచి కూడా దుబాయికి, బొంబాయికి వలసలు, పాలమూరు జిల్లా అయితే భయంకరమైన వలసలు. కొన్ని పార్టీలు చేసే పని చూస్తే బాధ కలిగేది. మహబూబ్నగర్ జిల్లాలో నూటికి 90 మంది యువకులు వలస. బతుకాలంటే బతుకపోవాలే. అక్కడ బతుకు లేదు. ఉన్న ముసలోళ్లకు వాళ్లు డబ్బులు పంపిస్తే కంట్రోల్ బియ్యం కొనుక్కొని తిని బతకాలి. అండ్ల కొంతమందికి అందకపోతే కొన్ని పార్టీల వాళ్లు తామేదో గొప్పతనం చేసినట్టు గంజి కేంద్రాలు పెట్టేవాళ్లు. అంత అద్వాన్న స్థితికి తెలంగాణను దిగజార్చారు.
అది కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వం కావొచ్చు. మంచినీళ్లు ఇయ్యలె. కరెంట్ ఇయ్యలె. మనదగ్గర నిలదీసే నాయకులు లేరు. అందరూ కట్టుబానిసలైపోయారు. ఆ పరిస్థితుల్లో మూలిగే నక్క మీద తాటికాయ ఆనాడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా కరెంట్ చార్జీలు పెంచిండు. తెల్లారే నేనొక ఉత్తరం రాసిన. నీ కరెంట్ చార్జీల పెంపుదల వాపసు తీసుకో. లేకపోతే ఈ సమైక్య రాష్ట్రంలో మాకు న్యాయం జరుగదని నేను తెలంగాణ ఉద్యమానికి పోవాల్సి వస్తదని చెప్పిన. ఆయన తీసుకోలేదు. కొంతమంది రైతులు పోరాటానికి హైదరాబాద్కు వస్తే పట్టపగలు 11:30 గంటలకు విచ్చలవిడిగా కాల్చి చంపేస్తే ముగ్గురు రైతులు అక్కడికక్కడే చనిపోయారు. ఇక లాభం లేదు. ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నం. ఎదురు తిరిగితే వీళ్లు కాల్చి చంపారు. జెండా ఎత్తడం తప్ప మార్గం లేదని చెప్పి ఆనాడు తెలంగాణ ఉద్యమానిక శ్రీకారం చుట్టినం. వెంబడి ఎవరు వచ్చినా రాకున్న ఆరే ప్రజలున్నరు.. యువకులున్నరు అని బయలు దేరిన అని కేసీఆర్ అన్నారు.
Valmiki Ramayana | ఆధ్యాత్మిక కలయిక.. ‘వాల్మీకి రామాయణం’ కోసం జతకట్టిన ఇళయరాజా!
Mahavatar Parshuraam | ధర్మ రక్షణ కోసం పరశురాముడి ఆగమనం.. ‘మహావతార్ పరశురామ్’ మోషన్ పోస్టర్ రిలీజ్