జగిత్యాల రూరల్, జనవరి 6: మల్యాల మండలంలోని నూకపల్లి గ్రామంలో జగిత్యాల వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో నిర్మించే వృద్ధాశ్రమానికి శాసనసభ నియోజకవర్గ నిధుల నుంచి రూ.10 లక్షలు కేటాయించినట్లు చొప్పదండి ఎ మ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచన మేర కు జగిత్యాల వెలమ సంక్షేమ మండలి ప్రధాన కార్యదర్శి దనపునేని వేణుగోపాలరావు ఆధ్వర్యం లో కార్యవర్గ సభ్యులు బూర్గుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను మర్యాద పూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ, వృద్ధాశ్రమానికి రూ.10లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వృద్ధాశ్రమంలో వెలమ సభ్యులతో పాటు ఇతర కులాల సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్యేను వెలమ సంక్షేమ మండల సభ్యులు ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన వెలమ సంక్షేమమండలి ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావును ఎమ్మెల్యే రవిశంకర్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మల్యాల జడ్పీటీసీ కొండపలకల రామ్మోహన్ రావు, హిమ్మత్‌రావుపేట సర్పంచ్ పునుగోటి కృష్ణారావు, పోతారం ప్యాక్స్ చైర్మన్ అయిల్నేని సాగర్ రావు, కొడిమ్యల ప్యాక్స్ చైర్మన్ మేన్నేని రాజనర్సింగరావు, వెలమ సంక్షేమ మండలి ఉపాధ్యక్షుడు అన్నమనేని సత్యనారాయణరావు, సంఘటిత కార్యదర్శి అయిల్నేని కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు మేన్నేని సురేందర్ రావు, బండారి వేణుగోపాల్‌రావు, వక్రాల కిరణ్ రావు, బెజ్జంకి అజిత్ రావుతోపాటు తదితరులు పాల్గొన్నారు.