సిరిసిల్ల రూరల్, జూన్ 8 : పోలీస్ శాఖలో 14 ఏళ్లుగా సేవలందించిందిన ఆ జాగిలం అనారోగ్యంతో మృతి చెందింది. తంగళ్లపల్లి మండలం తాడూరులోని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో లబ్రాడార్ రిట్రీవర్ సంతతికి చెందిన పదిహేనేళ్ల రాజా (జాగిలం) శనివారం ఉదయం చనిపోగా.. పోలీస్ అధికారు లు,జాగిలం హ్యాండ్లర్ మల్లేశంతో కలిసి ఎస్పీ అఖిల్ మహాజన్ ఆ జాగిలంపై పుష్ఫగుచ్చా లు వేసి నివాళులర్పించారు.
వీఐపీలు, వీవీఐపీలు సందర్శించినప్పుడు స్నిపర్, బాంబులు, మందుపాత్రలు గుర్తించడంలో జాగిలం రాజా చాకచక్యంగా వ్యవహరించదని గుర్తుచేశారు. 2010లో రాజా తన హ్యాండ్ల ర్ మల్లేశంతోపాటు ఎనిమిది నెలలపాటు ప్రత్యేకంగా ఐఐటీఏ మెయినాబాద్‌లో ట్రెయినిం గ్ తీసుకొని జిల్లాకు వచ్చిందని, అప్పటి నుంచి సేవలందించిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు యాదగిరి, మధుకర్, రమేశ్, డాగ్‌స్కాడ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.