RASAMAYI BALAKISHAN | మానకొండూర్ రూరల్, మార్చి 28: మాన కొండూరు పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో వేగురుపల్లిలో ఒక చోట ఉన్న అవ్వల దగ్గర మాజీ ఎమ్మెల్యే రసమయి ఆగి వారి బాగోగులు అడుగగా ‘నువ్వున్నప్పుడే బాగుండే బిడ్డా.. అప్పుడు రాజకీయలకు అతీతంగా సేవలందేవి. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నువ్యు సల్లగుండాలని బిడ్డా..’ అంటూ దగ్గరకు తీసుకుని వారు ఆప్యాయంగా పలుకరించారు.
మహాలక్ష్మి పథకం అమలు లేదు. కొత్త పింఛన్లు లేవు, మహిళలకు రూ.2500 లేవు. రూ.500 గ్యాసు వస్తలేదని రసమయితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మళ్లీ నువ్వే గెలువాలె బిడ్డా.. గెలుస్తావ్ పో బిడ్డా.. అంటూ గ్రామానికి చెందిన కనుకుంట్ల నర్సవ్వ, మామిడి లింగమ్మ, మామిడి రాజమణి ఆశీర్వదించారు .అంతకు ముందు రసమయి మండలంలోని వేగురుపల్లి, అన్నారం, ముంజంపల్లి, పలు గ్రామాల్లో మృతుల కుటుంబాలను, అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో ఉన్న బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.