Jagityal | రాయికల్, నవంబర్ 21 : ఈ-ఫార్ములా కేసులో కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ అనుమతించడం సరికాదని, ఇది కాంగ్రెస్, బీజేపీల కుట్ర అని జగిత్యాల జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత మండిపడ్డారు. రాయికల్ పట్టణంలో భారాస నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు, నాలుగు నెలలకు ఒకసారి లేదా ఎన్నికల ముందో, ఇంకేదైనా ఇంపార్టెంట్ అంశాన్ని కనుమరుగు చేయడం కోసమో మీడియాలో ఫార్ములా-ఈ అంటూ హడావిడి చేయడం ప్రజల దృష్టి మళ్లించడమేనని అన్నారు.
రేవంత్‌కు అలవాటైన స్క్రిప్ట్, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ది మాత్రమేనని, అందుకు ఆ గొంతును నొక్కాలని కుట్రపూరితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఫార్ములా నిర్వహణలో ఎలాంటి అవినీతి జరగలేదని, మీడియాతో చాలాసార్లు కేటీఆర్ చెప్పారని, డబ్బులు అత్యంత పారదర్శకంగా ఆన్లైన్లోనే బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేశాక అవినీతికి తావెక్కడ ఉంటుందని ప్రశ్నించారు.
పెట్టుబడుల ఆకర్షణకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతగా భావించి ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రిక్ మహనాల తయారీలో తెలంగాణ రాష్ట్రాలను హబ్ గా మార్చాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ముబిలిటీ వీక్ నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ వారోత్సవాల్లో భాగంగానే ఫార్ములా ఈరేస్ నిర్వహించినట్లు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాదులోకి అనేక పట్టుబడులు వచ్చాయని, మోస్ట్ లివబుల్ సిటీగా హైదరాబాద్ కు వరుసగా ఐదుసార్లు అవార్డు అందుకున్న ఘనత కేటీఆర్ కే దక్కిందని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేనందునే కేసీఆర్, కేటీఆర్ ను బద్నాం చేయాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి కుట్ర పన్నుతున్నాయన్నారని విమర్శించారు. ఎన్ని కుట్రలు చేసినా కేటీఆర్ ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు గా ఉంటారని, ప్రజల పక్షాన పోరాడుతారని, ఎలాంటి కేసులకు భయపడే లేదన్నారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఏలేటి అనిల్ కుమార్, మండల అధ్యక్షుడు బర్కాం మల్లేష్, కో ఆర్డినేటర్ తురగ శ్రీధర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరంపెల్లి రాణి సాయి కుమార్, రాయికల్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు సాయి కుమార్, సువర్ణ, నాయకులు శ్రీరాముల సత్య నారాయణ, రాజేందర్ గౌడ్, లింగం గౌడ్, రాంచంద్రం, వినోద్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.