Chigurumamidi | సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి.. చిగురుమామిడి ఎంపీడీవో రామ్మోహన్చారి
గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చిగురుమామిడి ఎంపీడీవో రామ్మోహన్ చారి, ఎంపీఓ బత్తిని కిరణ్ కుమార్, గ్రామ ప్రత్యేక అధికారులు, ఇరిగేషన్ ఎఈ నెహ్రు, మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ రెడ్డి, హౌసింగ్ ఎఈ విజయలక్ష్మి అన్నారు.
Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 8 : గ్రామాల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని చిగురుమామిడి ఎంపీడీవో రామ్మోహన్ చారి, ఎంపీఓ బత్తిని కిరణ్ కుమార్, గ్రామ ప్రత్యేక అధికారులు, ఇరిగేషన్ ఎఈ నెహ్రు, మండల వ్యవసాయ అధికారి పున్నం చందర్ రెడ్డి, హౌసింగ్ ఎఈ విజయలక్ష్మి అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా మండలంలోని రేకొండ, బొమ్మనపల్లి, ఉల్లంపల్లి, కొండాపూర్ గ్రామాల్లో గ్రామ సర్పంచ్ అధ్యక్షతన సోమవారం గ్రామసభ నిర్వహించారు.
ఈ గ్రామ సభలకు హాజరైన వారు మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే సమస్యలు సాధ్యమైనంతవరకు పూర్తవుతాయన్నారు. గ్రామ సమగ్ర అభివృద్ధి ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామంలో అవసరం ఉన్న విద్యుత్ స్తంభాలు, నూతన గృహాలకు త్రాగునీటి సౌకర్యం, పారిశుద్ధం, సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు, డ్రైనేజీలు, గ్రామాల్లో నీటి నిల్వలు ఉండకుండా చూడాలన్నారు. ఈ గ్రామ సభలో సర్పంచులు అల్లెపు సంపత్, కొంకట మౌనిక, అలువాల శంకర్, మార్క రాజ్ కుమార్, ఏఈవోలు అఖిల, రాకేష్, పంచాయతీ కార్యదర్శులు గోదారి అజయ్, నాగరాజు, జ్యోతి, అమృత వర్షిని, ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

