Jagityal | జగిత్యాల, జూన్ 29 : జగిత్యాలకు చెందిన రేవెల్ల రవీందర్ (57) జూన్ 16న ఇజ్రాయిల్‌లో గుండె పోటుతో మృతి చెందారు. అదే సమయంలో ఇజ్రాయిల్ – ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియలో అవరోధాలు ఏర్పడ్డాయి. మృతదేహాన్ని స్వదేశానికి తరలించే పనిలో తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర విదేశాంగ శాఖ సహాయంతో వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి.
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం సంజయ్ కుమార్, మాజీ మంత్రి జీ రాజేశం గౌడ్, జగిత్యాల మున్సిపల్ కౌన్సిల్ మాజీ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి, తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇజ్రాయిల్‌లోని ఇండియన్ ఎంబసీతో సంప్రదింపులు జరిపారు. అలాగే ఇజ్రాయిల్‌లోని తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షులు సోమ రవి సమన్వయంతో మృతదేహం తరలింపు ప్రక్రియ వేగవంతమైంది.
రవీందర్‌కు బీమా పాలసీ లేకపోవడం వల్ల మృతదేహం రవాణా ఖర్చులను భారత రాయబార కార్యాలయం భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందు ఆపరేషన్ సింధులో భాగంగా ఆయన మృతదేహాన్ని విమాన మార్గంలో తరలించేందుకు ప్రయత్నించారు. అయితే కొన్ని ఆంక్షలు ఎదురవ్వడంతో అది వీలు కాలేదు. యుద్ధ పరిస్థితుల వల్ల ఆలస్యం జరిగినప్పటికీ, ఇప్పుడు కాల్పుల విరమణ నేపథ్యంలో మృతదేహం తరలింపునకు మార్గం సుగమం సులువైంది. ప్రస్తుత పరిస్థితుల్లో, రవీందర్ మృతదేహం కలిగిన శవపేటికను రోడ్డు మార్గంలో ఇజ్రాయిల్ నుంచి జోర్డాన్ రాజధాని అమ్మాన్‌కు తరలించి, అక్కడి నుండి విమాన మార్గంలో ఢిల్లీకి