మాకు మూడెకరాల భూమి ఉంది. ఇద్దరం అన్నదమ్ములం కలిసే వ్యవసాయం చేస్తున్నం. గతంలో నీటికి ఇబ్బందులు లేకపోవడంతో మంచి పంటలు పండినయ్. ఈసారి కూడా పంట పండుతదనే ఆశతో మూడెకరాల్లో వరి వేసినం. కానీ, భూగర్భ జలాలు అడుగంటినయ్.
బావిల నీళ్లు లేకపోవడంతో క్రేన్ కిరాయికి తెచ్చుకొని కుటుంబ సభ్యులమే బావి తవ్వినం. మొత్తంగా రూ.3 లక్షల దాకా ఖర్చు పెట్టినం. కానీ, నీళ్లు సరిపడా రాక సగం పొలం విడిచి పెట్టినం. మా భూమి పక్కకే ఎస్సారెస్పీ పిల్ల కాలువ ఉంది. ముందే నీళ్లిస్తే పొలం ఎండకపోయేది. ఇప్పుడు ఇస్తున్నరు. ఏం లాభం? జరగాల్సిన నష్టం జరిగింది.
– శీల సతీశ్, అడవిశ్రీరాంపూర్ (ముత్తారం)