Boyanapalli | బోయినపల్లి రూరల్ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అనంతపల్లి గ్రామంలో ఉప సర్పంచ్ గొడిశెల తిరుపతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర కావ్య, మహిళా వార్డు సభ్యులు తోడేటి దీప, ఆరెపల్లి అంజలి, గట్టు భాగ్య, ఏముండ్ల లాస్య మరియు మాజీ వార్డ్ మెంబెర్ గొడిశెల స్వప్నను సన్మానించారు.
ఈ సందర్భంగా ఉప సర్పంచ్ తిరుపతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు రావాలని సూచించారు. మహిళల హక్కులను పరిరక్షించడం, వారికి సమాన అవకాశాలు కల్పించడం సమాజంలోని ప్రతీ ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు శుభాకాంక్షలు తెలియజేసి, మహిళా స్వయం శక్తి కి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ సహకారం అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజశేఖర్, గంగాధర లక్ష్మణ్, తోడేటి చంటి గ్రామ పెద్దలు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.