సైదాపూర్ : పురుషుల పొదుపు సమితి పరిధిలోని వెన్కేపల్లి శ్రీ శివ రామకృష్ణ పురుషుల పొదుపు సంఘం సభ్యుడు ఎగుర్ల సంపత్ ఇటీవల మృతి చెందాడు. కాగా, అతడి భార్య రేణుకకు బీమా నగదును(Insurance money) పొదుపు సంఘం ఆధ్వర్యంలో సోమవారం అందించారు. బీమా నగదు 6,9113రూపాయలను మండల సమితి అధ్యక్షుడు పైడిపల్లి రవీందర్ గౌడ్ వెన్కేపల్లి సంఘం అధ్యక్షుడు వెల్ది రాజు, ఉపాధ్యక్షులు దొంత కిరణ్ అందించారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు ఆలేటి శ్రీనివాస్, కొండ వెంకటేశ్వర్లు, ఆలేటి రాములు, గుంటి స్వామి, లంకసిరి రాజు, తూటి శ్రీనాథ్ ,అయినాల రాజు, దొంత శ్రీనివాస్, అంతడుపుల విజయేందర్ సమితి గణకులు అనగోని వీరన్న, సంఘం గణకులు గుర్రం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Watch: రోడ్డు దాటుతూ పాల వ్యక్తిని ఢీకొట్టిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Rocket Ammunition: చెత్తకుప్పలో రాకెట్లు.. పంజాబ్లో స్వాధీనం
Hyena attacks | గర్మిల్లపల్లి హైనా హల్ చల్.. రెండు లేగదూడల దాడి