DHARMAPURI | వెల్గటూర్, ఏప్రిల్ 02. మండలంలోని కిషన్ రావు పేట లోని నాగపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం సీసీ కెమెరాలను ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, వీటితో చోరీలు జరగకుండా ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో వెల్గటూర్ ఎస్సై ఆర్ ఉమాసాగర్, ఆలయ కమిటీ చైర్మన్ నైనాల అజయ్, కోశాధికారి తరాల శివ, గౌరవ అధ్యక్షులు కుమ్మరి వెంకటేష్, ఉపాధ్యక్షులు పాదం సురేష్ సభ్యులు తిరుపతి తదితరులు ఉన్నారు.