Pegadapally | పెగడపల్లి: ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టుకోవాలని పెగడపల్లి ఎంపీడీవో శశికుమార్ రెడ్డి పేర్కొన్నారు. పెగడపల్లి మండలంలోని నామాపూర్ గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పనులను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు నిర్మాణ పనులకు సంబంధించి బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి జాప్యం ఉండదని తెలిపారు.
నిర్మాణ పనులకు సంబంధించి విడుతలవారీగా బిల్లుల మంజూరు చేయడం జరుగుతుందని, లబ్ధిదారులు త్వరగా నిర్మాణ పనులు చేపట్టుకోవాలని పేర్కొన్నారు. అనంతరం మ్యాకవెంకయ్యపల్లి లో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అలాగే గ్రామానికి చెందిన వన నర్సరీని ఎంపీడీవో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.