Indiramma houses | సారంగాపూర్, జూలై 16: ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోవాలని ఎంపీడీవో చౌడారపు గంగాధర్ అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని కోనాపూర్, లక్ష్మిదేవిపల్లి, ధర్మనాయక్ తండా, పోచంపేట్, బట్టపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసిడింగ్ పత్రాలను బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తప్పని సరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, త్వరగా ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభించి 45 రోజుల్లో పూర్తి చేయాలని పేర్కొన్నారు. అలాగే బీర్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రొసిడింగ్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో సారంగాపూర్, బీర్పూర్ ఎంపీడీవోలు చౌడారపు గంగాధర్, భూమేష్, ఎంపీవో సలీమ్, ఆయా గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.