Independence Day | సిరిసిల్ల టౌన్, ఆగస్టు 15 : జిల్లా కేంద్రంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థలలో ఆయా అధికారులు నిర్వాహకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్థానిక గాంధీచౌరస్థాలో మున్సిపల్ కమిషనర్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అదేవిధంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ జాతీయ జెండా, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
జిల్లా వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలలో అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో నేతన్న చౌక్ లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాఫ్స్కట్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, అర్బన్ బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ, సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మీనారాయణ, మా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ మాజి చైర్మన్ జిందం కళ, టిపిటిడిసి మాజి చైర్మన్ గూడూరి ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ మాజి చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జడ్పీ మాజి వైస్ చైర్మన్ సిద్ద బొల్లి రామ్మోహన్, న్యాలకొండ రాఘవరెడ్డి, బండ నర్సయ్యయాదవ్, అన్నారం శ్రీనివాస్, దార్ల సందీప్, మ్యాన రవి, సత్తార్, జక్కుల నాగరాజుయాదవ్, కోడి అంతయ్య, కొమ్ము బాలయ్య, ఎదురుగట్ల.. చంద్రయ్యగౌడ్, జవహర్‌రెడ్డి, కుంబాల మల్లారెడ్డి, అక్రం, జిల్లా వైద్యుల సంఘం సభ్యులు, సామాజిక సమరసతా వేదిక సభ్యులు, తదితర నాయకులున్నారు.