Independence Day | ఓదెల, ఆగస్ట్ 15 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలను రంగురంగు జెండాలతో శోభాయమానంగా తీర్చిదిద్దుకున్నారు. జాతీయ జెండా త్రివర్ణ పథకాన్ని ఎగురవేశారు. విద్యార్థులకు, ప్రజలకు స్వీట్లు పంచారు. స్వాతంత్ర్య రావడానికి అమరులైన పలువురు స్వతంత్ర సమరయోధులను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని వారికి నివాళులర్పించారు.
పోత్కపల్లి సింగిల్ విండో కార్యాలయంలో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, తాసిల్దార్ ధీరజ్ కుమార్, పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సై రమేష్, ఎంపీడీవో తిరుపతి, ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో ఈవో సదయ్య, ఎంఈఓ రమేష్, ఏపీఎం సంపత్, వ్యవసాయ అధికారి భాస్కర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, పెరక సంఘ కార్యాలయంలో అధ్యక్షుడు గోపతి ఎల్లయ్య, వ్యాన్ అసోసియేషన్ అధ్యక్షుడు వీర్ల సదయ్య, గౌడ సంఘం అధ్యక్షుడు నాగపురి రవి, మత్స్యశాఖ అధ్యక్షుడు మంద కొమురయ్య, గ్రామపంచాయతీ కార్యాలయాలలో ప్రత్యేక అధికారులు, పాఠశాలలో హెచ్ఎంలు జాతీయ జెండాలను ఎగరవేశారు. కార్యక్రమాలలో పోత్కపల్లి సింగిల్ విండో సీఈవో గోలి అంజిరెడ్డి, నాయకులు ఆకుల మహేందర్, బోడగుంట చిన్నస్వామి తదితరులు పాల్గొన్నారు.