మహనీయుల విగ్రహాలపై ఎమ్మెల్యే అలసత్వం
ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న తిమ్మాపూర్ మండల కేంద్రంలో విద్యార్థులకు స్ఫూర్తి నింపాలన్న ఉద్దేశంతోనే మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశామని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గుర్తు చేశారు.
- అందుకే మేమే ఆవిష్కరించాం
- చిత్తశుద్ధి ఉంటే సుందరీకరణ పూర్తి చెయ్
- అందరం కలిసి అంబేద్కర్ జాతర చేద్దాం
- మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
- తిమ్మాపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేదర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ
తిమ్మాపూర్, జూలై 2 : ఎడ్యుకేషన్ హబ్‌గా ఉన్న తిమ్మాపూర్ మండల కేంద్రంలో విద్యార్థులకు స్ఫూర్తి నింపాలన్న ఉద్దేశంతోనే మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేశామని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ గుర్తు చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆవిష్కరణ ఆలస్యమైందని వివరించారు. తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ అలసత్వం ప్రదర్శించారని, అందుకే తాము ఆవిష్కరించామని స్పష్టం చేశారు. తిమ్మాపూర్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో గతంలో తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేదర్, జగ్జీవన్ రామ్ విగ్రహాలను గురువారం ఉదయం దళిత సంఘాల నాయకులతో కలిసి రసమయి ఆవిషరించారు. పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు.
తామే పనులు చేయిస్తామని పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఇటీవలి కాలంలో పర్మిషన్ వచ్చిందని, రూ. కోటి నిధులతో సుందరీకరణ చేయిస్తానని ప్రకటించి నెలలు గడుస్తున్నాయని చెప్పారు. అయినా ఇప్పటికీ పనిచేయడం లేదని, అందుకే తామే ఆవిషరించి పనులు ప్రారంభించామన్నారు. అందులో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.
కవ్వంపల్లికి చిత్తశుద్ధి ఉంటే రూ.కోటితో సుందరీకరణ పూర్తి చేస్తే అందరం కలిసి అంబేదర్ జాతరను పండుగలా చేద్దామన్నారు. అనంతరం అకడే దళిత సంఘాల నాయకులు దళితులతో కలిసి భోజనాలు చేశారు. రసమయి వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేశ్, రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, దళిత సంఘాల నాయకులు వంతడుపుల సంపత్, బోయిని కొమురయ్య, తిరుపతి, సంగుపట్ల మల్లేశం, మహేశ్, బొర్ర రవీందర్, కొండ్ర రాజు, తదితరులు పాల్గొన్నారు.
పొద్దంతా ఉద్రిక్తత
రసమయి బాలకిషన్ మానకొండూర్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో దళిత సంఘాల నాయకుల కోరిక మేరకు బీఆర్ఎస్ హయాంలో ఆర్టీసీ అధికారుల అనుమతితో అంబేదర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలను నెలకొల్పారు. అయితే అసెంబ్లీ ఎన్నికలు రావడం, ప్రభుత్వం మారడంతో అప్పటి నుంచి విగ్రహాల ఏర్పాటు రాజకీయమైంది. ఎట్టకేలకు కొద్ది నెలల క్రితం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రభుత్వం నుంచి అనుమతి తెచ్చానని, సుందరీకరణ చేయిస్తానని హామీ ఇచ్చారు.
ఆ హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నా విగ్రహాలు అలాగే ఉండడంతో రసమయి, దళిత సంఘాల నాయకులు విసిగిపోయారు. ఈ నేపథ్యంలోనే గురువారం దళిత సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించగా, పొద్దంతా ఉద్రిక్తత నెలకొన్నది. విషయం తెలిసిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకొని, పనులను అడ్డుకున్నారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
Bulldozers: డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడి కాల్చివేత.. బుల్డోజర్లతో నిందితుడి ఇళ్లు కూల్చివేత
Bottle Cap | వాటర్ బాటిల్ మూత గొంతులో ఇరుక్కుని చిన్నారి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

