NTPC | జ్యోతినగర్, మే 5 : బాలికల సాధికారిత ధ్యేయంగా ఎన్టీపీసీ యాజమాన్యం ఎన్టీపీసీ ప్రభావిత గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివిని విద్యార్థులకు ఎన్టీపీసీ గర్ల్స్ ఎంపైర్మెంట్ మిషన్ పేరిట ప్రతీ ఏడాది వేసవి కాలంలో ఉచితంగా అందిస్తున్న బాలికల సాధికారత వర్కుషాప్ ఈ ఏడాది 2026కు కూడా ఎన్టీపీసీ యాజమాన్యం ప్రారంభోత్సవం నిర్వహించారు.
ఈ మేరకు మంగళవారం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని కాకతీయ ఫంక్షన్హాల్లో వర్కుషాప్ శిక్షణను ఎన్టీపీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ చందన్‌కుమార్ సమంత, దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సమంత ముఖ్యఅతిథిగా పాల్గొని వర్కుషాప్‌ను ప్రారంభోత్సవం చేశారు. అనంతరం శిక్షణ బాలికలకు స్టడీ కిట్లు, యూనిఫామ్స్ అందజేశారు.