ఫర్టిలైజర్‌సిటీ, మే 5: అనారోగ్యంతో పేదలు ఆర్థిక ఇబ్బందులు పడవద్దనే ప్రభుత్వ దవాఖానల్లో సకల వసతులు కల్పిస్తున్న సీఎం కేసీఆర్ పాలనలో ఆరోగ్య తెలంగాణ సాకారమవుతున్నదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కొనియాడారు. శుక్రవారం రాత్రి గోదావరిఖని ప్రభుత్వ దవాఖానలో ఏర్పాటు చేసిన 85 పడకలు, సిటీ స్కాన్‌ను సెంటర్‌ను ప్రారంభించి, మాట్లాడారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి మెడికల్ కళాశాల వచ్చి, పేదలకు మెరుగైన వై ద్యం ముంగిట్లోకి రావడం ఆనందంగా ఉందన్నా రు. రామగుండానికి మెడికల్ కళాశాల మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. దవాఖానలో నిష్ణాతులైన వైద్యులతో సేవలు అందుతున్నాయని, 24 గంటల పాటు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు. త్వరలో 330 బెడ్ల సామర్థ్యానికి పెరుగనున్నట్లు వివరించారు. కాగా, మెడికల్ కళాశాల ఏర్పాటుతో తమకు ఉపాధి లభించడంపై పారిశుధ్య సిబ్బంది ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం దవాఖాన సిబ్బందిని ఎ మ్మెల్యే గజమాలతో సన్మానించారు. ఇక్కడ మే యర్ అనిల్‌కుమార్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు, సూపరింటెండెంట్ దయాల్‌సింగ్, సిబ్బంది రాజశేఖర్‌రెడ్డి, అశోక్, రాజు, నాయకులు నూతి తిరుపతి, దొమ్మేటి వాసు ఉన్నారు.