Odela Mallanna Temple | ఓదెల, సెప్టెంబర్ 5: పెద్దపల్లి జిల్లా లో ప్రసిద్ధిగాంచిన ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో నెలకొల్పిన వినాయక విగ్రహాన్ని శుక్రవారం నాంసానిపల్లి గ్రామంలోని చెరువులో నిమజ్జనం చేశారు. ఇక్కడ గత నవరాత్రులు వివిధ పూజలు అందుకున్న వినాయకుడికి శుక్రవారం వేద పండితులు ధూపం వీరభద్రయ్య, భవాని ప్రసాద్, పంచాక్షరీలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెరువులో నిమజ్జనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బీ సదయ్య, జూనియర్ అసిస్టెంట్ ముద్దసాని కుమారస్వామి, మహాదేవుని భూమయ్య, శ్రీనివాస్, సుధీర్, మల్లేష్, రమేష్, రామచంద్రం, మానస, భక్తులు తదితరులు పాల్గొన్నారు.