విద్యానగర్, సెప్టెంబర్ 12 : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పిల్లల వైద్య నిపుణుడు రాజేశ్‌పై గురువారం జరిగిన దాడిని ఐఎంఏ కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ పొలాస రామ్‌కిరణ్, వెంకట్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. గురువారం కరీంనగర్లో అత్యవసర సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌లోని ప్రైవేట్ దవాఖానల్లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.