Peddapally | పెద్దపల్లి కమాన్, ఆగస్టు 11: పెద్దపల్లి జిల్లా లో ని 15 ఏళ్లు పై బడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే నవ భరత్ సాక్షరాత్ లక్యమని డీఈవో అన్నారు. పెద్దపల్లి బాలుర ఉన్నత పాఠశాల లో మండల రీ సోర్స్ పర్సన్లకు వయోజన విద్య పై సోమవారం ఒకరోజు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ. మహిళా సంఘాల్లో ని నిరక్ష్యరాస్యులను విద్యావంతులు గా మార్చేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.
ఇందుకోసం జిల్లా స్థాయి లో మండలానికి ఇద్దరు చొప్పున 28 మంది ఎంఆర్పీలకు శిక్షణ ఇచ్చి నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లా లో గుర్తించబడిన 28,326 మందికి చదువు నేర్పించనున్నట్లు డీఈవో చెప్పారు. డీఆర్ పీ లు జక్కం శ్రీనివాస్, స్వరూప్ చంద్, అనిల్ ప్రసాద్ జీవన నైపుణ్యాలను పెంపొందించుకోవడం, వాలంటీర్లను ప్రోత్సహించడం, అక్షరాస్యతా కేంద్రాల నిర్వహణ, వయోజన విద్య బోధనా పద్ధతులు, పాఠ్యాంశాల మార్గదర్శకాలపై వివరించారు. జిల్లా వయోజన విద్య ఏపీవో ఎం శ్రీనివాస్, పెద్దపల్లి ఎంఈవో సురేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.