GANGADHARA | గంగాధర, ఏప్రిల్ 10 : కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో పేలుడు పదార్థాల అక్రమ రవాణా కలకలం సృష్టించింది. ఎస్సై వంశీకృష్ణ కథనం ప్రకారం.. కరీంనగర్ వైపు నుండి జగిత్యాలకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు జగిత్యాల నుండి కరీంనగర్ వెళ్తున్న ఓ తప్పుడు నంబర్ గల ఆటో మధురానగర్ గ్రామపంచాయతీ పరిధిలోని జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకొన్నాయి. బస్సు ముందు భాగం దెబ్బతినగా, ఆటో డ్రైవర్ పారిపోయాడు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆటోను తనిఖీ చేయగా కాటన్ బాక్స్, రెండు సంచులలో 600 జిలేస్టిన్ స్టిక్స్, డి కార్డు వైర్ బండిల్ దొరికినట్లు, వీటి విలువ సుమారు రూ.12,500 ఉంటుందని తెలిపారు. సంఘటనా స్థలంలో దొరికిన పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుని, ఎటువంటి అనుమతులు లేకుండా వాటిని అక్రమంగా తరలిస్తున్న గుర్తుతెలియని ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చే ఎస్సై వంశీకృష్ణ తెలిపారు. పేలుడు పదార్థాలు ఎక్కడినుండి వస్తున్నాయనే కోణంలో విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.