Gangadhara | గంగాధర, ఫిబ్రవరి 1 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని, పరిపాలన చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్ పేరుతో రాజకీయ డ్రామాలు ఆడుతున్నాడని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మీచినేని నవీన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ నోటీసులు జారీ చేయడానికి నిరసనగా సోమవారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు నల్ల రిబ్బన్లు ధరించి, మధురానగర్ చౌరస్తాలో, కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు సీట్ నోటీసులు జారీ చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న కేటీఆర్, నిన్న హరీష్ రావు, సంతోష్ కుమార్, ఇవాళ కెసిఆర్ కు నోటీసులు రాక్షసానందం పొందుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన కేసీఆర్ ఇబ్బంది పెడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే కర్రు కాల్చి వాత పెడతారని స్పష్టం చేశారు.
ఇక్కడ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, నాయకులు కంకణాల విజయేందర్ రెడ్డి, వేముల దామోదర్, రామిడి సురేందర్, ద్యావ మధుసూదన్ రెడ్డి, కరబూజ తిరుపతి గౌడ్, మడ్లపల్లి రమేష్, గడ్డం స్వామి, ఎండి అబ్బాస్, పుట్టం రవీంద్రనాథ్ ఠాగూర్, ఎండి నజీర్, పొన్నం పరశురాములు, దోమకొండ మల్లయ్య, పానుగంటి లక్ష్మీనారాయణ, తడి గొప్పల రమేష్, ఉప్పుగండ్ల జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.