MLA Kavvampalli Satyanarayana | తిమ్మాపూర్, సెప్టెంబర్18: మానకొండూర్ నియోజకవర్గం గన్నేరువరం మండలం గుల్లపల్లి నుండి కొత్తూరు వరకు రోడ్డు పూర్తి చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసి తీరుతానని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రభుత్వాన్ని ఘాటుగా హెచ్చరించారు. ఆయన శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా రోడ్డు వేస్తానని హామీ ఇచ్చానని, లేనిపక్షంలో నిరాహార దీక్ష చేస్తానని మాట ఇచ్చానని, ప్రభుత్వం స్పందించి రోడ్డు వేయాలని నిండు సభలో స్పష్టం చేశారు. లేనిపక్షంలో నిరాహార దీక్ష చేసి తీరుతానని చెప్పారు. ప్రభుత్వం దృష్టి సారించి తన నియోజకవర్గంలో రోడ్లన్నీ పూర్తి చేయాలని కోరారు. ప్రభుత్వంపై ఘాటుగా మాట్లాడడంతో నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది.