PRTU TS | పెద్దపల్లి కమాన్, ఆగస్టు 13 : ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన పాత పెన్షన్ పథకాన్ని అమలు చేయకుంటే పోరాటం తప్పదని పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షుడు గుండు కృష్ణమూర్తి హెచ్చరించారు. బుధవారం జిల్లా కేంద్రంలో సీపీఎస్ వ్యతిరేక మహాధర్నా గోడ పత్రిక ఆవిష్కరించారు.
పెన్షన్ విద్రోహ దినం సందర్బంగా సెప్టెంబర్ 1 న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాకు పెద్దపల్లి జిల్లా నుంచి సీపీఎస్ ఉద్యోగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, రాములు, రాజయ్య, రాజేందర్, సత్యనారాయణ, నరేందర్, శ్రీనివాస్, ప్రతాపరెడ్డి, రాజమౌళి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.