గోదావరిఖని, అక్టోబర్ 28: ‘కాంగ్రెస్‌ను గెలిపిస్తే గుండారాజ్ పాలన వస్తుంది..బీఆర్ఎస్ను గెలిపిస్తే సంక్షేమ రాజ్యం వస్తుంది..ప్రజలు విజ్ఞతతో ఆలోచించాలి.’ అంటూ రామగుండం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ సూచించారు. కుంభకోణాల పార్టీని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సింగరేణి ఆర్జీ-1 జీడీకే-11వ గని. రామగుండం 48, 32, 43, 45, 46 డివిజన్లలో నిర్వహించిన ప్రజా అంకితయాత్రలో ఆయన మాట్లాడారు. దేశాన్ని అరవైఏండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలను అధోగతి పాలుచేసిందని మండిపడ్డారు. రామగుండం ప్రజలు రౌడీయిజానికి వత్తాసు పలకరనే విశ్వాసం ఉన్నదన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఈనగాచి నక్కల పాలు కానియ్యద్దని, కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
నాడు ఉద్యమానికి సంబంధంలేనివారు ఇప్పుడు సీఎం కేసీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. ఆనాడు చంద్రబాబు కార్మికుల ఉద్యోగాలను ఊడగొట్టి హక్కులను కాలరాసి రోడ్డు మీద పడవేస్తే వైఎస్సార్ గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరిట తీరని అన్యాయం చేశారని నిప్పులు చెరిగారు. వారు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించి ఛిద్రమైన కుటుంబాలను కాపాడిన మహా నేత కేసీఆర్ అని కొనియాడారు. వారసత్వ ఉద్యోగాలు పొందిన వారు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు కేసీఆర్‌కు కృతజ్ఞతగా కారు గుర్తుపై ఓటు వేసి హ్యాట్రిక్ సీఎం చేయాలని కోరారు.
తాను ఎమ్మెల్యేగా రూ. 350 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, వైద్య కళాశాలను మంజూరు చేయించానని చెప్పారు. తాను కార్మికుడి బిడ్డగా వారి కష్ట సుఖాలు తెలుసనని రాష్ట్ర అభివృద్ధిలో కార్మికుల పాత్ర తెలిసేల ఫైవింక్లయిన్ చౌరస్తాలో కార్మికుల శిల్పాలతో సుందరీకరణ చేశానని చెప్పారు. హైదరాబాద్ రాజకీయాన్ని ఇక్కడ రుద్దాలని వచ్చే టూరిస్టుల మోసపు మాటలు నమ్మి విలువైన ఓటును వృధా చేయవద్దని కో రారు.
కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. నగర మేయర్ అనిల్‌కుమార్, నాయకులు నా యిని శంకర్, గండ్ర దామోదర్, మాదాసు రాంమ్మూర్తి, జాహిద్ పాషా, వడ్డెపల్లి శంకర్, కనకం శ్యాంసన్, మూల విజయారెడ్డి, పుట్ట టరమేశ్, పొలాడి శ్రీనివాస్, మారుతి, నర్సింగరావు, పీచర శ్రీనివాస్, కారొరేటర్లు పొన్నం విద్య లక్ష్మణ్, ఐత శివ, ధరణి స్వరూప, కొమ్ము వేణు, నేతలు కౌశిక హరి, తా నిపర్తి గోపాల్‌రావు, రత్నాకర్, తిరుపతి, బెందె నాగభూషణం, సన్ని, డా.శ్రీనివాస్, హమీద్, మహేశ్, రవి, మాణిక్యం, సురేశ్ పాల్గొన్నారు.