MLA Padi Kaushik Reddy | హుజూరాబాద్ టౌన్, జూలై 3: ప్రతీ నిరుపేదకు కష్టకాలంలో అండగా ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇంటింటికి మన కౌశిక్ అన్న కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఆయన గురువారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పట్టణంలోని 29 మంది లబ్ధిదారులకు రూ.8లక్షల35వేల విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారుల ఇంటికి కౌశిక్ రెడ్డి స్వయంగా వెళ్లి అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజలకు అవసరమైన సమయంలో అండగా ఉండాలన్న బాధ్యతతో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతీ కుటుంబం పట్ల తన వంతు కర్తవ్యం నిర్వర్తించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని ఆయన పేర్కొన్నారు. అలాగే, బాధితులు ఆరోగ్యంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. అనంతరం పట్టణంలో ఇటీవల మరణించిన, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కుటుంబాలను ఆయన పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గందే శ్రీనివాస్, కౌన్సిలర్లు ముత్యం రాజు, తిరుమల్ రెడ్డి, యాదగిరి, కుమార్, కొండ్ర నరేష్, అనిల్, పూర్ణచందర్, కుమారస్వామి, తాళ్లపెల్లి శ్రీనివాస్, ఇమ్రాన్, రమా, కిషన్, ప్రతాప్ కృష్ణ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.