హుజూరాబాద్, డిసెంబర్ 4: తెలంగాణ ఉద్య మం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు హుజూరాబాద్ గడ్డ గులాబీ పార్టీ అడ్డగా నిలుస్తున్నది. రెండేండ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నిల్లో మినహా నాటి నుంచి నేటి వరకు ఈ నియోజకవర్గ ప్రజలు కారు పార్టీకే జైకొడుతున్నారు. ఉత్కంఠభరితంగా కొనసాగిన ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కే అండగా నిలిచారు. 2001లో జరిగిన పరిషత్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయదుందుభి మోగించి తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోశారు. అప్పటి నియోజకవర్గంలోని హుజూరాబాద్, ఎల్కతుర్తి, సైదాపూర్, భీమదేవరపల్లి మొత్తం నాలుగు జడ్పీటీసీలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. ఆదే ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో సర్పంచులను బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి ఉద్యమకాంక్షను చాటారు.
2004 ఎన్నికల్లో బీఆర్ఎస్ కారు గుర్తుపై కెప్టెన్ లక్ష్మీకాంతారావు పోటీ చేసి గెలిచి మంత్రి పదవి చేపట్టాడు. అప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తులో భాగంగా హుజూరాబాద్ టికెట్‌ను బీఆర్ఎస్కు కేటాయించగా లక్ష్మీకాంతారావుకు ప్రజలు పట్టం కట్టి ఉద్యమకాంక్షను చాటారు. 2004లో కాంగ్రెస్‌లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యమాన్ని అణచివేసేందుకు అప్పటి సీఎం వైఎస్ఆర్ చేసిన ప్రయ త్నం లేదు. అయితే 2006లో జరిగిన పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో కూడా దాదాపు సగం స్థానాల్లో బీఆర్ఎస్ను ప్రజలు గెలిపించి హుజూరాబాద్ గడ్డా ఎప్పుడూ గులాబీదేనని చాటి చెప్పా రు. ఆ తర్వాత ఉద్యమకాంక్ష తెలిపేందుకు 2008 జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తరపున బరిలోఉన్న లక్ష్మీకాంతారావును గెలిపించి ఉద్యమతీవ్రతను రాష్ర్టానికి ఇక్కడి ప్రజలు చాటిచెప్పారు.
పునర్విభజనలో భాగంగా కొత్తగా ఏర్పడ్డ హుజూరాబాద్ నియోజకవర్గంలో 2009 లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్‌ను అప్పుడు కాంగ్రెస్ పవనాలు వీచినప్పటికి ప్రజలు అండగా నిలిచారు. 2010లో తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిల్చిన ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్‌ను భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించి ఉద్యమ సవాల్ విసిరారు. ఆ సమయంలో కాం గ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పడిన తర్వాత మొదటిసారిగా జరిగిన 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.
2018 ఎన్నికల్లో ప్రత్యర్థి పాడి కౌశిక్‌రెడ్డిపై 43వేల 719 ఓట్ల మెజార్టీతో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన రాజేందర్ మరోసారి విజయకేతనం ఎగురవేశాడు. 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్‌కు సానుభూతి పవనాలు వీచినప్పటికి బీఆర్ఎస్కు 85 వేల పైచిలు కు ఓట్లు రావడం విశేషం. చంపుకొంటారో సాదుకుంటరో వంటి సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఈటల రాజేందర్ గెలచినట్లు రాజకీయ విశ్లేషకులు భావించారు. ఈ ఎన్నికల్లో పాడి కౌశిక్‌రెడ్డి బీఆర్ఎస్ తరపున పోటీచేసి విజయఢంకా మో గించారు. ఆది నుంచి పరిశీలిస్తే హుజూరాబాద్ అడ్డా బీఆర్ఎస్ అడ్డానేనని మరోసారి రుజువైంది.
హుజూరాబాద్ టౌన్, డిసెంబర్4: శాసన సభ ఎన్నికల్లో హుజురాబాద్ ఎమ్మెల్యేగా విజ యం సాధించిన బీఆర్ఎస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి సోమవారం రాత్రి బీఆర్ఎస్ జాతీ య అధ్యక్షుడు, కే చంద్రశేఖర్‌రావును తన నివాసంలో కలిసి ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రం అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల జమ్మికుంటకు వచ్చిన కేసీఆర్ ప్రచారంలో కౌశిక్‌రెడ్డిని ఎమ్మె ల్యేగా గెలిపించి తనకు గిఫ్టుగా ఇవ్వాలని కేసీఆ ర్ కోరగా, దానికి ఓటర్లు పెద్దఎత్తున సరేనం టూ నినదించారు.
ఆదివారం వెల్లడైన ఫలితా ల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద ర్‌పై గెలువ డంతో ఎమ్మెల్యే ధ్రువీకరణ పత్రాన్ని ఆర్వో నుంచి అందుకొని, నేరుగా కేసీఆర్‌కు గిఫ్ట్ గా అందజేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కాగా, ఆయన సతీమణి శాలినీరెడ్డి, కూతురు శ్రీని కారెడ్డిని కేసీఆర్ ఆశీర్వదించారు. భవిష్యత్‌లో శ్రీనికరెడ్డికి మంచి అవకాశాలు వస్తాయని, చకగా చదువుకొని తండ్రి అడుగుజాడల్లో నడవాలని కేసీఆర్ సూచించారు.