హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా మాటలతో మభ్యపెడుతున్నదని మండిపడ్డారు.
- ఆరు గ్యారెంటీలు.. తులం బంగారంపై సమాధానం చెప్పాలి
- కల్వల ప్రాజెక్ట్‌ను పునరుద్ధరించాలి
- ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
వీణవంక, జూలై 3: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా మాటలతో మభ్యపెడుతున్నదని మండిపడ్డారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరుగ్యారెంటీలు.. ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మితోపాటు ఇస్తామన్న తులం బంగారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
వీణవంక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం 48 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా ప్రజలను గోస పెడుతున్నదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పాలనలో విజయవంతంగా అమలు చేసిన పథకాలను నిలిపివేసిందని, ప్రజలకు మేలు చేసే ఆ పథకాలు నచ్చకపోతే ఇంకో పేరు పెట్టి అయినా కొనసాగించాలని సూచించారు. రాజకీయాలు మాని ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని హితవు పలికారు. కల్వల ప్రాజెక్ట్‌ను పునరుద్ధరిస్తే వేల ఎకరాలకు నీరంది రైతులు బాగుపడతారని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
ఇసుక క్వారీల వల్ల లారీల రవాణాతో పోతిరెడ్డిపల్లి, రెడ్డిపల్లి, కోర్కల్, మల్లారెడ్డిపల్లి, హిమ్మత్‌నగర్, కొండపాక గ్రామాల రోడ్లు పూర్తిగా ధ్వంస మయ్యాయని మండిపడ్డారు. వాటిని బాగు చేయకుంటే లారీలను అడ్డుకుంటామని హెచ్చరించారు. నియోజకవర్గంలో మానేరు ఉన్నా ఇసుక దొరకని పరిస్థితి ఉన్నదని, ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.7 వేల నుంచి రూ.9 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆగ్రహించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇసుకను తీసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
రూ.30 కోట్లతో చేపట్టిన వీణవంక రహదారి నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ స్వప్న, మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక-తిరుపతిరెడ్డి, తహసీల్దార్ రమేశ్, ఎంపీడీవో రవి సుధాకర్, సర్పంచులు దాసారపు సరోజన, అందె శ్రీమతి, దూడపాక శ్రీవేణి, గజ్జెల మొగిలయ్య, తిరుపతిగౌడ్, మండల కుమార్, రామిడి సంపత్‌రెడ్డి, బావు సంపత్, గాజుల శంకర్, గెల్లు శ్రీనివాస్, నాయకులు కామిడి శ్రీనివాస్‌రెడ్డి, చింతల శ్యాంసుందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సుధాకర్, యాసిన్, స్వామి, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indiramma Illu | ఆశలు కూల్చిన ‘ఇందిరమ్మ’!.. పాత ఇల్లు కూల్చేయడంతో నిలువనీడ లేక.. ఖాళీ స్థలంలోనే తల్లి అంత్యక్రియలు!
Thummala Nageshwara Rao | యాసంగిలో వరి వేయొద్దు.. రైతులకు తుమ్మల నాగేశ్వరరావు సూచన
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

