చిగురుమామిడి, ఫిబ్రవరి 18: ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం హుస్నాబాద్ నుంచి హైదరాబాద్‌కు రెండు లగ్జరీ బస్సులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని లగ్జరీ బస్సులను మంత్రి హరీశ్‌రావు సహకారంతో వారం రోజుల్లోనే మంజూరు చేసుకోవడం జరిగిందన్నారు. హుస్నాబాద్‌కు రెగ్యులర్ డిపో మేనేజర్ వస్తారని తెలిపారు.
రాబోయే రోజుల్లో యాదగిరిగుట్ట వరకు, గోదావరిఖని వరకు బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత-శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, జిల్లా నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, మండల ప్రచార కార్యదర్శి బెజ్జంకి రాంబాబు, మండల నాయకులు దేవేందర్ రెడ్డి, సదానందం పాల్గొన్నారు.