suicide | ఫర్టిలైజర్ సిటీ, అక్టోబర్ 25 : గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన గంధం రాంకీ (29) అనే యువకుడు తన భార్య కాపురానికి రావడం లేదనే మనస్థాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు . గోదావరిఖని-1టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. గత రెండు సంవత్సరాల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తి రాంకీ భార్య పుట్టింటికి వెళ్లింది.
ఒంటరితనం భరించలేక రామ్ కి ఈ నెల 20న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు కరీంనగర్ లో గల ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని ఆసుపత్రికి తరలించారు కాగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గోదావరిఖని-1టౌన్ ఎస్ఐ రాజయ్య తెలిపారు.