చిగురుమామిడి, డిసెంబర్ 16: స్థానిక పంచాయతీ ఎన్నికల్లో రెండో విడతలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని పలు గ్రామాల్లో గత ఎన్నికల్లో సర్పంచ్‌లుగా గెలిచి మరో మారు తమ సతీమణులను బీఆర్ఎస్ మద్దతుదారులతో బరిలో దింపి విజయం సాధించారు. గాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సన్నీల్ల కవిత బీఆర్ఎస్ మద్దతుతో బీసీ మహిళ రిజర్వు అవకాశం రావడంతో బరిలోకి దిగి విజయం సాధించారు. ఆమె భర్త సన్నిల్ల వెంకటేశం గత స్థానిక ఎన్నికల్లో 2019- 24 వరకు బీఆర్ఎస్ మద్దతుతో గ్రామ సర్పంచ్ గా కొనసాగారు.
పీచుపల్లి గ్రామంలో రెండో విడతలో భాగంగా జనరల్ రిజర్వ్ కావడంతో పీచు సత్యనారాయణరెడ్డి బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ గా విజయం సాధించారు. గత స్థానిక ఎన్నికల్లో 2019- 24 లో ఆయన సతీమణి పీచు లీల సర్పంచ్ గా కొనసాగారు. భర్త సింగిల్ విండో చైర్మన్, భార్య సర్పంచ్, సుందరగిరి గ్రామానికి చెందిన జంగా వెంకటరమణారెడ్డి సింగల్ విండో చైర్మన్ గా కొనసాగుతున్నారు. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో గ్రామంలో జనరల్ మహిళ రిజర్వ్ కావడంతో ఆయన సతీమణి జంగ శిరీషను బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ గా బరిలో దింపి గెలిపించుకున్నారు. వీరు గతంలో రాజకీయంగా, ప్రజా ప్రతినిధులుగా అనుభవం ఉండడంతో గ్రామాభివృద్ధికి పాటుపడతారని ఆయా గ్రామాల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

జంగా వెంకటరమణారెడ్డి, శిరీష

పీచులీల, సత్యనారాయణ రెడ్డి