Collector Koya Sri Harsha | పెద్దపల్లి కమాన్, జులై 11: పర్యావరణ పరిరక్షణతో నే మానవాళి మనుగడ సాధ్యమని, ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రం లోని ఐటీఐ ప్రాంగణంలో ఎమ్మెల్యే విజయరామారావుతో కలిసి శుక్రవారం మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మొక్కలను పెంచితేనే పర్యావరణన్ని కాపాడుకోవచ్చని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. పట్టణంలోని బ్లాక్ ప్లాంటేషన్, అవెన్యూ ప్లాంటేషన్ లో మొక్కలు నాటాలని అన్నారు.
ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. ప్రస్తుతం నాటిన 550 మొక్కలు వచ్చే సంవత్సరం నిర్వహించే వన మహోత్సవం నాటికి సంరక్షించాలని అన్నారు. మార్కెట్ కమిటీల చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్ రావు, జిల్లా అటవీ శాఖ అధికారి శివయ్య, ఆర్టీఓ రంగారావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, తహసీల్దార్ రాజయ్య పాల్గొన్నారు.