Kalvakuntla Vidyasagar Rao | జగిత్యాల, సెప్టెంబర్ 15: కాంగ్రెస్ పార్టీ ఫాక్స్ చైర్మన్ పదవి కాలం ఎలా పొడిగిస్తారని, బీఆర్ఎస్ చైర్మన్ల పదవీ కాలం ఎందుకు పొడిగించరని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు దావా వసంత, ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, కార్యకర్తలతో కలిసి కలెక్టర్ సత్యప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలోని 23 పాక్స్ (PACS) సొసైటీల బోర్డుల పదవీకాలం ముగిసిన సందర్భంలో, కొత్త ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుతం ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లను కొనసాగించాలని డిమాండ్ చేశారు.
గతంలో పార్టీ బేదం లేకుండా పదవీ కాలం పొడిగించిన ఘనత కేసీఆర్ దన్నారు. పాక్స్ సొసైటీలు గ్రామీణ రైతులకు జీవనాడి వంటివని, ఇవి లేకుండా రైతులు రుణాలు పొందడం, విత్తనాలు-ఎరువులు అందుకోవడం, పంటల కొనుగోలు జరగడం కష్టసాధ్యమన్నారు. అలాంటి సమయంలో కొత్త బోర్డులు ఏర్పడే వరకు ప్రస్తుత బోర్డులను కొనసాగించడం ద్వారా రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు. రైతుల శ్రేయస్సే ధ్యేయమని, రైతులు ఇబ్బందులు పడకుండా, పాక్స్ సొసైటీలు నిరంతరంగా పనిచేసేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ని అభ్యర్థించారు.
రైతు సంక్షేమం కోసం ఎప్పుడూ ముందుండే నాయకత్వమే నిజమైన ప్రజానాయకత్వమని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బీఆర్ఎస్ పార్టీ పాక్స్ చైర్మన్ల పదవి కాలం కూడా పొడిగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ అర్బన్, మండల అధ్యక్షులు ఆనంద్ రావు, తుమ్మ గంగాధర్, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, పోతారం మల్లాపూర్, చిట్టపూర్, సిర్పూర్, ఆత్మకూర్ సొసైటీల చైర్మన్లు సాగర్ రావు, నర్సిరెడ్డి, అంజి రెడ్డి, మోహన్ రెడ్డి, నవీన్ రెడ్డి, ఆది రెడ్డి పాక్స్ డైరెక్టర్లు, నాయకులు అయ్యోరి రాజేష్ , ఎల్లా రాజన్న, లక్ష్మణ్ రావు, గంగారం, సన్నిత్ రావు, మోహన్, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.