House arrest | కరీంనగర్, తెలంగాణ చౌక్, ఏప్రిల్ 10 : గిరిజన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పలు గిరిజన సంఘాలు గురువారం చలో హైదరాబాద్ కు పిలుపు ఇచ్చాయి. దీంతో హైదరాబాదుకు తరలి వెళ్లడానికి సిద్ధపడ్డ తెలంగాణ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బోడ మోహన్, ప్రధాన కార్యదర్శి బీమా సాహెబ్ ను తెల్లవారుజామున పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపడానికి వెళుతున్న తమను పోలీసులు ముందస్తు గృహనిర్బంధం చేయడాన్ని ఖండించారు. ఎన్నికల ముందు గిరిజన సమస్యలు పరిష్కరిస్తామని మేనిఫెస్టో చేర్చిన కాంగ్రెస్ అధికారం రాగానే సమస్యల పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. సామాజిక, ఆర్థిక రాజకీయంగా వెనుకబడిన గిరిజనుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. గిరిజన సమస్యలను పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ పార్టీ ప్రజా ప్రతినిధులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రజా పాలన కొనసాగిస్తాని ప్రకటించిన కాంగ్రెస్ నిర్బంధాలతో ఉద్యమాలను అణిచివేయాలని కుట్రలు చేస్తే ప్రజల తిరుగుబాటు తప్పదన్నారు.