నిప్పుల కొలిమి
రోజురో జుకూ ఎండలు ముదురుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి. రోజంతా భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో సాయంత్రం 6 గంటల వరకు వేడి గాలులు వీస్తున్నాయి. కని ష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 25 డిగ్రీలకు పైగానే న మోదవుతుండడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
- రాష్ట్రంలోనే అత్యధికంగా వీణవంకలో 45.8 డిగ్రీల సెల్సియస్
- పెద్దపల్లి జిల్లాలోని 9 మండలాల్లో 45డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
- సగటున 42 డిగ్రీలుగా నమోదు
మొన్నటి వరకు కాస్త చల్లగా ఉన్నా.. మూడు నాలుగు రోజుల నుంచి ఎండ దంచికొడుతున్నది. ఉదయం గంటల నుంచే భగ్గుమంటున్నది. శనివారం సగటు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలుగా నమోదు కాగా, పొద్దంతా నిప్పుల కొలిమిలా మారింది. వీణవంకలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మండలం చుట్టు పక్కల ఉన్న జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోనూ 45 డిగ్రీలు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో సగటున 42 డిగ్రీలు నమోదు కాగా, వేడిగాలులు, ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరయ్యారు.
కరీంనగర్, మే 13 (నమస్తే తెలంగాణ) : రోజురో జుకూ ఎండలు ముదురుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటుతున్నాయి. రోజంతా భానుడు ప్రతాపం చూపిస్తుండడంతో సాయంత్రం 6 గంటల వరకు వేడి గాలులు వీస్తున్నాయి. కని ష్ఠ ఉష్ణోగ్రతలు కూడా 25 డిగ్రీలకు పైగానే న మోదవుతుండడంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రాత్రిళ్లు చల్లగా, మ ధ్యాహ్నం ఎండలు తీవ్రంగా ఉంటే, అలాంటి వాతావరణంతో జాగ్రత్తగా ఉండాలని వైద్యు లు సూచిస్తున్నారు. కాగా, శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదు కాగా, వీణవంకలో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ మండలం చుట్టు పక్కల ఉన్న జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లోనూ ఎండ 45 డిగ్రీలకు చేరింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 43 డిగ్రీలు కాగా, అత్యల్పం గా గంగాధరలో 39-41 డిగ్రీల మధ్యన నమోదైంది. ఇక పెద్దపల్లి జిల్లాలో 9 మండలాల్లో అ త్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ య్యాయి. జగిత్యాల జిల్లా ఇబ్రహీంంపట్నం మండలంలో అత్యధికంగా 45.4 డిగ్రీలు న మోదుకాగా, మల్లాపూర్, మెట్పల్లి, సారంగాపూర్, ధర్మపురి, బుగ్గారం, గొల్లపల్లి మండలాల్లోనూ 44-45 డిగ్రీల మధ్య నమోదయ్యా యి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మం డలంలో 45 డిగ్రీలు కాగా, జిల్లాలోని మిగతా మండలాల్లో 43 డిగ్రీలుగా నమోదయ్యాయి. నిరుటి కంటే ఈసారి ఎండలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గతేడాది ఇదే రోజున 40 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు నమోదవగా, ఆదివారం ఎండలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

