tenth exams | సారంగాపూర్ : మండలంలోని బట్టపెల్లి గ్రామానికి చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని పదో తరగతి పరీక్షల్లో 500 పైన మార్కులు సాధించిన సుస్మిత, జయశ్రీ విద్యార్థులను గురువారం మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందించి సన్మానించారు.
ఈ సందర్భంగా నాయలుకు మాట్లాడుతూ కష్టపడి చదువుతూ ఉన్నత విద్యల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అర్రే లక్ష్మి, నాయకులు ప్రేమనందం, మల్లేష్ యాదవ్, విద్యార్థుల తల్లిదండ్రులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.