Jagityal | జగిత్యాల : ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన మొదటి వార్డ్ కౌన్సిలర్ చెట్టే గంగాధర్, 7వార్డ్ కౌన్సిలర్ కోరు కంటి రాము, 37 వార్డు కౌన్సిలర్ కొక్కు అనిత గంగాధర్‌ను జగిత్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు పట్టణ సంఘ భవనంలో శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లకు శాలువా కప్పి అభినందించారు. అనంతరం ఇటీవల జగిత్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్నికల్లో గెలుపొందిన నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు శాలువా కప్పి సన్మానించారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కోరు కంటి రాము, ఉపాధ్యక్షుడు ఏనుగుర్తి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి తునికి సదాచారి, కోశాధికారి ఇల్లంతకుంట రమణాచారి, కార్యవర్గ సభ్యులు కోరుగంటి బీమ్ రాజ్, గుగ్గిళ్ళ శ్రీనివాస్, కోరుకంటి చంద్రమౌళి, సత్యనారాయణ చారి, రవి, కృష్ణ కుమార్, వేణుగోపాల్, నారాయణ, నాగసముద్రం, అనంత రాములు, కొత్తపల్లి విశంబర్ తదితరులు పాల్గొన్నారు.