పుస్తెలమ్మి అప్పులు కడుతున్నం
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులకు ఉపాధి కరువైందని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు, వేములవాడ ఆటో యూనియన్ నాయకుడు చంద్రగిరి శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు.
- కాంగ్రెస్ పాలనలో రోడ్డునపడ్డం
- ఒక్క మా ఆటో యూనియన్లోనే 23 మంది డ్రైవర్లు సచ్చిపోయిండ్రు
- ఎలక్ట్రికల్ ఆటోలు తెస్తే ఉద్యమమే
- కాంగ్రెస్ సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు, ఆటో యూనియన్ నేత శ్రీనివాస్‌గౌడ్
వేములవాడ, ఆగస్టు 1: రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులకు ఉపాధి కరువైందని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు, వేములవాడ ఆటో యూనియన్ నాయకుడు చంద్రగిరి శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తంచేశారు. ఉపాధిలేకపోవడంతో ఆ టోల కొనుగోలు కోసం తీసుకొచ్చిన అప్పు లు భార్యల మెడలోని పుస్తెలు అమ్మి కడుతున్నామంటూ భావోద్వేగానికి గురయ్యా రు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో వేములవాడ సబ్ డివిజన్ ఆటో యూనియన్‌లో 1,800మంది వీధిన పడగా.. 23మంది మృతి చెందారని గుర్తుచేశారు. ఆటో కార్మికుల ప్రభావం వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఉంటుందని హెచ్చరించారు.
శనివారం వే ములవాడలోని తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆటో కార్మికుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌గౌడ్ మా ట్లాడుతూ.. వేములవాడ లాంటి పుణ్యక్షే త్రం కావడంతో అంతంత మాత్రంగానే కి రాయి దొరుకుతుందని, మిగతా చోట్ల ఉపాధి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్ర భుత్వం ఎలక్ట్రిక్ ఆటోలను తీసుకొచ్చే ఆలోచన ఉంటే వెంటనే విరమింపజేసుకోవాలని కోరుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అధికారులకు కలిసి వినతిపత్రం అందజేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే తీవ్ర నిరసన తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

