Nandimedaram | ధర్మారం, జనవరి 26: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన బొడ్డు ప్రశాంత్ బిఎస్ఎఫ్ లో జవాన్ గా ఎంపిక కాగా ఆయనను స్థానిక బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. స్థానికుడైన బొడ్డు నర్సయ్య కుమారుడు ప్రశాంత్ బీఎస్ఎఫ్ జవాన్ ఉద్యోగానికి ఎంపికై ఇటీవల శిక్షణ పూర్తి చేసుకున్నాడు.
అనంతరం ప్రశాంత్ త్రిపురలో రాష్ట్రంలో సదరు ఉద్యోగానికి పోస్టింగ్ ఇచ్చారు. దీంతో గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రశాంత్ తో పాటు అతని తండ్రిని బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సామంతుల రాజమల్లయ్య ఆధ్వర్యంలో సన్మానించి అభినందించారు. దేశ సేవ కోసం ప్రశాంత్ ఎంపిక కావడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు.