5 గుంటలో 50వేలు.. బంతి పూల సాగుతో మంచి లాభాలు
ఆ రైతు బంతి పూల దోట విరబూసింది. ఐదు గుంటల్లోనే మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. సరాసరి ఐదు నెలలకు 50 వేల దాకా ఆదాయం వస్తున్నది. పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామానికి చెందిన రైతు కట్ల చంద్రయ్యకు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. దాదాపు రెండెకరాల్లో వరి వేశాడు
- ఐదు నెలల్లో సరాసరి నెలకు 10 వేల ఆదాయం
- ఆదర్శం రైతు చంద్రయ్య
పెగడపల్లి, డిసెంబర్ 16 : ఆ రైతు బంతి పూల దోట విరబూసింది. ఐదు గుంటల్లోనే మంచి లాభాలు తెచ్చిపెడుతున్నది. సరాసరి ఐదు నెలలకు 50 వేల దాకా ఆదాయం వస్తున్నది. పెగడపల్లి మండలం రాములపల్లి గ్రామానికి చెందిన రైతు కట్ల చంద్రయ్యకు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. దాదాపు రెండెకరాల్లో వరి వేశాడు. మిగతా 20 గుంటలలో పౌల్ట్రీఫాం నడిపిస్తున్నాడు. మరో 5 గుంటల్లో బంతి పూలు సాగు చేశాడు. గత అక్టోబర్లో తిమ్మాపూర్ మండలం అల్గునూర్ వద్ద ఉన్న నర్సరీలో 5కు ఒక మొక్క చొప్పున 2,500 ఎరుపు, పసుపు రంగు బంతి పూల మొక్కలను తీసుకొచ్చి నాటాడు.
మంచి యాజమాన్య పద్ధతులు పాటించాడు. మొక్కలు నాటిన 60 నుంచి 70 రోజులకు అంటే ప్రస్తుతం పూలు పూస్తుండడంతో రైతు చంద్రయ్య సంతోష పడుతున్నాడు. పంట నాణ్యంగా ఉందని, దిగుబడి కూడా బాగుందని ఆనందపడుతున్నాడు. ప్రస్తుతం మల్లన్న దేవుడి పట్నాల సీజన్ కావడంతో పంట చేను వద్దకే వచ్చి 100కు కిలో చొప్పున పూలు కొంటున్నారని చెబుతున్నాడు. 5 గుంటల్లో బంతి సాగుకు 15 వేల వరకు పెట్టుబడి పెట్టానని, ఇప్పటివరకు 20 వేల వరకు ఆదాయం వచ్చిందని తెలిపాడు. మరో రెండు నెలల పాటు పంట దిగుబడి ఉంటుందని, 30 వేల వరకు ఆదాయం వస్తుందని వివరించాడు. వచ్చే సంవత్సరం మరింత ఎక్కువ మొత్తంలో బంతి పూల సాగు చేస్తానని, ఇతర పంటల సాగు కన్నా ఆదాయం బాగున్నదని చెబుతున్నాడు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

