Dharmaram | ధర్మారం, జూలై 10 : ఆయిల్ పామ్ తోటల సాగుతో అధిక లాభాలు ఉన్నాయని రైతులు వాటి సాగుకు ముందుకు రావాలని పెద్దపల్లి ఉద్యానవన శాఖ సుంక మహేష్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామయ్యపల్లి గ్రామంలో గాగిరెడ్డి సునంద, గాగిరెడ్డి హేమలత మహిళలకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆరెకరాలలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఆయిల్ పామ్ మొక్కలు నాటించారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక గ్రామ సర్పంచి మూల మంగ చే మొక్కలు నాటించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ ఉద్యానవన శాఖ మహేష్ మాట్లాడుతూ నీటి వసతి ఉన్న ఆయిల్ ఫామ్ రైతులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆయిల్ పామ్ తోటలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వ రాయితీ అందించి ప్రోత్సహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఆయిల్ పామ్ సాగుచేసిన అనంతరం 3 ఏళ్లలో కాతకు వస్తుందని, దీంతో అప్పటినుంచి లాభాలు రైతుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ తోటలకు ఎలాంటి చీడపీడలు ఉండవని, కోతుల బెడద కూడా ఉండదని ఆయన తెలిపారు. కాగా కానంపల్లి గ్రామంలో 2022 సంవత్సరలో నాటిన ఆయిల్ పామ్ తోటలో ప్రస్తుతం రెండో పంట కోతలు చేసిన ఆరే నర్సయ్య, చెరుకుతోట శంకరయ్య, ఏనుగు ఎల్లారెడ్డి, చెరుకుతోట మల్లయ్య అనే రైతులను ఈ సందర్భంగా ఉద్యాన వన శాఖ అధికారులు సన్మానించారు. అలాగే రామయ్య పల్లి గ్రామంలో ఆయిల్ పామ్ తోటలో సాగుకు ముందుకొచ్చిన గాగిరెడ్డి సునంద-డిల్లేశ్వర్ రెడ్డి దంపతులను కూడా వారు సన్మానించారు. ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ గాగిరెడ్డి ఢిల్లేశ్వర్ రెడ్డి, తిరుమల ఆయిల్ ఫామ్ కంపెనీ సీఈవో కేషు కల్యాంకర్, మండల ఉద్యాన విస్తరణ అధికారి బీ మహేష్, ఫీల్డ్ ఆఫీసర్ కొండా హరీష్, రైతులు తదితరులు పాల్గొన్నారు.