Survey | సారంగాపూర్, జనవరి 23 : సారంగాపూర్ మండలంలోని రేచపల్లి ఆటవి ప్రాంతంలో ఆ శాఖ అధికారులు జంతు గనన సర్వెను నిర్వహిస్తున్నారు. మూడు రోజులుగా నిర్వహిస్తున్న శాఖహార జంతు గనన శుక్రవారంతో పూర్తి కావడంతో మరో మూడు రోజుల పాటు మాంసాహార జంతు గణన చేపట్టనున్నట్లు అటవి అధికారులు పేర్కొన్నారు. మండలంలోని రేచపల్లి వెస్ట్, ఈస్ట్ బీట్ పరిధిలో పెద్ద చెట్లు, చిన్న చెట్లు ఎన్ని ఉన్నాయి. గడ్డి మొక్కలు ఏమి ఉన్నాయి. ఏఏ జంతువులు ఉన్నాయి. తదితర అంశాలపై సర్వెను చేపడుతున్నారు.
ముడు రోజుల్లో శాఖహార సంతువుల కాలిముద్రలను గుర్తించి వాటి ఆధారంగా సరిశీలించగా అటవి ప్రాంతంలో పదుల సంఖ్యలో కొండ గొర్రెలు, మనువోతులు, జింకలు, నెమళ్లు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కోన్నారు. మూడు రోజుల పాటు మంసాహార జంతువుల గననలో భాగంగా అడవి పిల్లులు, అడవి నక్కలు ఉన్నట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి గనన చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రేచపల్లి సెక్సన్ అధికారి ప్రవీణ్, సారంగాపూర్ బీట్ అధికారి గోపాల్, బెస్ క్యాంపు దేవెందర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.