Heavy Rain | వెల్గటూర్, మే 23 : గత రెండు రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలు వెలగటూర్ మండలంలో శుక్రవారం గంటపాటు ఎడతెరిపి లేకుండా దంచి కొట్టింది. ఈ వర్షాల వల్ల రోడ్లపైన వరద ప్రవహించింది. వెల్గటూరు మండల కేంద్రంలో శుక్రవారం యువ వికాసం పథకానికి నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు వచ్చిన యువకులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.