Hanuman Jayanti | సుల్తానాబాద్ రూరల్, మే 22: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని పలు ఆలయాలలో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుల్తానాబాద్ పట్టణంలోని పెరిగిద్ద హనుమాన్ ఆలయంతో పాటు సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల శ్రీసీతారామచంద్రస్వామి సంకట వియోచన రామభక్త వీర హనుమాన్ ఆలయం, పలు ఆలయల్లో గురువారం పెద్ద హనుమాన్ జయంతి ని పురస్కరించుకొని హనుమాన్ విగ్రహానికి అభిషేకాలు, పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చందనం వేసి, తమలపాకులతో ప్రత్యేక పూజలు చేశారు.
ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాల వద్ద దంపతులచే హోమం కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నకల్వల భక్తమండలి సభ్యులు వంగపల్లి అనసూయ దేవి సుగుణాకర్ రావు, సుల్తానాబాద్ పెరిగిద్ద హనుమాన్ ఆలయ చైర్మన్ ఆకుల రామ్మూర్తి దంపతులు, డైరెక్టర్లు పిడుగు సరోజన ఓదెలు, కత్తెర్ల పోచమల్లు, హనుమాన్ స్వాములు, భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.