Hanuman Jayanti | కాల్వశ్రీరాంపూర్, మే 22 : : కాల్వశ్రీరాంపూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం నుంచి భక్తులతో ఆలయం కీటకిటలాడింది. జయంతి పురస్కరించుకొని హనుమాన్ విగ్రహానికి పంచామృత అభిషేకాలు హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
హనుమాన్ విగ్రహానికి చందనం వేసి తమలపాలపాకులతో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.