ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుల్ నిజాయితీ
ప్రయాణికురాలు బస్సులో మరిచిపోయిన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు కరీంనగర్ ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుల్ సంతోష్
- ప్రయాణికురాలు పోగొట్టుకున్న బంగారు ఆభరణాల బ్యాగు అప్పగింత
తెలంగాణచౌక్, డిసెంబర్ 5: ప్రయాణికురాలు బస్సులో మరిచిపోయిన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగును తిరిగి అప్పగించి నిజాయితీ చాటుకున్నారు కరీంనగర్ ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుల్ సంతోష్. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఉద యం కరీంనగర్ డిపో-2 కు చెందిన సూపర్‌లగ్జరీ బస్సు జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి కరీంనగర్‌కు చేరుకున్నది. ప్రయాణికులు అంతా దిగి వెళ్లిపోయారు. బస్సు డిపో-2కు వెళ్లే టైంలో ఇన్కమింగ్ చెకింగ్‌లో భాగంగా సెక్యూరిటీ కానిస్టేబుల్ సంతోష్ తనిఖీ చేశారు. బస్సులో బ్యాగును గుర్తించారు. హెడ్‌కానిస్టేబుల్ సమక్షంలో తెరిచి చూడగా అందులో బంగారు అభరణాలతోపాటు కొత్త చీర లు, మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయి.
ఈ క్రమంలో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. వారు విచారణ జరిపి నగరానికి చెందిన టీ విజయలక్ష్మిగా గుర్తించి సమాచారం ఇచ్చారు. డిప్యూటీ ఆర్ఎం కవిత, చందర్రావు, సెక్యూరిటీ ఆఫీసర్ రవీందర్ సమక్షంలో ప్రయాణికురాలికి సదరు బ్యాగును అందజేశారు. నిజాయితీగా బ్యాగును అప్పగించిన సిబ్బందికి విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. కానిస్టేబుల్ సంతోష్‌ను ఆర్టీసీ రీజయన్ అధికారులు అభినందించారు. ఇక్కడ డిపో-2 మేనేజర్ మల్లయ్య, సిబ్బంది ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

