రామడుగు, నవంబర్ 23: హ్యాండ్‌బాల్ క్రీడకు రామడుగు మండలం రాష్ర్టానికే కేంద్ర బిందువు కావడం ఆనందంగా ఉందని ఎంపీపీ కలిగేటి కవిత, ఎస్ఐ అంజయ్య పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ (అండర్ 15) ఎంపిక పోటీలను వారు సర్పంచ్ పంజాల ప్రమీలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ, ఎస్ఐ మాట్లాడుతూ, రామడుగు మండల క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించడం హర్షణీయమని పేర్కొన్నారు. పోటీల్లో క్రీడాకారులు క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. కాగా, ఈ పోటీల్లో కరీంనగర్, రామడుగు, చింతకుంట, దుర్శేడు, సిరిసిల్ల, కోరుట్ల, గుల్లకోట, జగిత్యాల, అంబారిపేట, గోపాల్రావుపేట, చెగ్యాం, భీమారం, చొప్పదండి, మంథని, గంగాధర, శ్రీరాములపల్లి, ముస్తాబాద్, మొగ్దుంపూర్, పెద్దపల్లి, బెజ్జంకి, సుల్తానాబాద్, కొత్తపల్లి, ఎలగందల నుంచి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొన్నట్లు ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వీర్ల వెంకటేశ్వరరావు, బసరవేణి లక్ష్మణ్ తెలిపారు.
ఈ పోటీల్లో ఎంపికైన జిల్లా జట్టు డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు వరంగల్ జిల్లా పైడిపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. సంఘం జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రభాకర్, సభ్యులు కృష్ణహరి, విద్యాసాగర్, ప్రేమ్, పీఈటీలు రాజు, అశోక్, యశోద, రాకేశ్, దీప, శౌరి, అరుణ, సుస్మిత, రజిత, భాను, మహేశ్, రాజిరెడ్డి, మహేందర్, సంపత్, విజయ్, సూర్యతేజ, శ్రీనివాస్, హ్యాండ్‌బాల్ శిక్షకుడు వెంకటేశ్, ఏఎంసీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.