ఘనంగా గురుపౌర్ణమి.. కిక్కిరిసిన ఆలయాలు.. అలరించిన సంగీత విభావరి
పట్టణంలోని మార్కండేయనగర్లో గల షిర్డీ సాయిబాబా ఆలయంలో సోమవారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు సాయిబాబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరివార దేవతలకు వైభవం గా పూజలు నిర్వహించారు.
- ప్రత్యేక పూజలు చేసిన భక్తులు
- కిక్కిరిసిన ఆలయాలు
- అలరించిన సంగీత విభావరి
వేములవాడ టౌన్/వేములవాడ రూరల్, ఇల్లంతకుంట/రుద్రంగి, జూలై 3: పట్టణంలోని మార్కండేయనగర్లో గల షిర్డీ సాయిబాబా ఆలయంలో సోమవారం గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేకువజాము నుంచే భక్తులు సాయిబాబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరివార దేవతలకు వైభవం గా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దూలం రఘు బృందం అలపించిన భక్తిసంగీత విభావరి ఆకట్టుకున్నది. దాదాపు 10వేలకు పైగా మంది సాయిబాబాను దర్శించుకోగా, వీరికి అన్నదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, వేములవాడ డీఎస్పీ నాగేంద్రాచారి, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్‌రెడ్డి, పుల్కం రాజు, రామతీర్థపు రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, కాంగ్రెస్ నాయకుడు ఆది శ్రీనివాస్, కౌన్సిలర్లు ఉన్నారు. ఇక్కడ సాయిబాబా ట్రస్ట్ నిర్వాహకులు వారాల దేవయ్య, రైకనపాట శ్రీనివాస్, కోనమ్మగారి నాగరాజు, కుమార్, ఎంబేరి నర్సయ్య, నాగుల యాదగిరి, గంప రాజేందర్, రమేశ్, వెంకటేశం, గంప గౌరీశంకర్, బండారి కుమార్, నాగుల యాదగిరి, పీచర రవీందర్రావు తదితరులు ఉన్నారు.
అలాగే వేములవాడలోని సాయిబాబా ఆలయంలో బీఆర్ఎస్ నేత లక్ష్మీనర్సింహరావు ప్రత్యేక పూజలు చేశా రు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఇక్కడ ము న్సిపల్ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ తదితరులు ఉన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్, హన్మాజీపేటలోని సాయిబాబా ఆలయాల్లో గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. స్వామివారిని బీఆర్ఎస్ నాయకులు చల్మెడ లక్ష్మీనర్సింహారావు, ఏనుగు మనోహర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, కౌన్సిలర్ నిమ్మశెట్టి విజ య్, శంకర్, సాగరం వెంకటస్వామి, కొమురయ్య, నాగుల విష్ణుప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, రాకేశ్, రాజు, పరశురాము లు, స్వామి, వివేక్, మహేశ్, చిరంజీవి, రవి ఉన్నారు.
ఇల్లంతకుంటలోని పలు పాఠశాలల్లో గురుపూర్ణిమ వేడుకలు నిర్వహించారు. మనకు విద్య నేర్పిన గురువుల ను పూజించుకోవాలని హెచ్ఎం మహేశ్ చంద్ర తెలిపారు. ఇక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు.
రుద్రంగిలోని సాయిబాబా ఆలయంలో జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీ సేవకు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు తీపిరెడ్డి వెంకట్‌రెడ్డి, తీగల శ్యామ్‌రావు, అంగల మల్లేశం, బాసని భూమయ్య, పడాల శంకరయ్య ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

