సందేశాత్మకంగా ‘హుషార్ పిట్టలు’
అన్షు, వాసవి గణేషన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘హుషార్ పిట్టలు’. బిక్షు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ యాదవ్ దర్శకుడు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది.
అన్షు, వాసవి గణేషన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘హుషార్ పిట్టలు’. బిక్షు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి వెంకట్ యాదవ్ దర్శకుడు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. ట్రైలర్ను ఈ నెల 10న రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ …ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకు మరింత పాజిటివ్ వైబ్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, ప్రేక్షకులు పెట్టే డబ్బులకు వందశాతం న్యాయం చేసే సినిమా ఇదని నిర్మాత వెంకట్ యాదవ్ పేర్కొన్నారు. ఈ సినిమా చూస్తూ కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చానని, తన కెరీర్ను కూడా మలుపుతిప్పుతుందనే నమ్మకం ఉందని సంగీత దర్శకుడు చరణ్అర్జున్ అన్నారు. సందేశం కలబోసిన కమర్షియల్ చిత్రమిదని, పతాక ఘట్టాలు హృదయానికి హత్తుకుంటాయని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
Nominated Posts | నీకు పదవొస్తే.. నాకెంతిస్తావ్.. వరంగల్ సహా దక్షిణాది జిల్లాల్లో పదవికో రేట్!
Build Now Rules | వంద గజాల ప్లాట్ల యజమానులకు షాక్.. 30 ఫీట్ల రోడ్డు లేకపోతే ఇల్లు కట్టలేరు
Vote | నేను బతికే ఉన్నా.. 11 ఎన్నికల్లో ఓటు వేస్తే.. ఇప్పుడు నోటీసులు ఇస్తరా?.. ‘సర్’పై వృద్ధుడి నిరసన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

